స్వచ్ఛఅవనిగడ్డ సైనికులు

              సమాజంలో చైతన్యం తీసుకువస్తున్న స్వచ్ఛఅవనిగడ్డ సైనికులు

Sri Mandali Venkata Krishna Rao Fisheries Polytechnic College at Bhavadevarapalli

Sri Mandali Venkata Krishna Rao Fisheries Polytechnic College at Bhavadevarapalli

The first Fisheries Polytechnic College in the country, which would train the ‘second level’ technical staff required for aquaculture, was inaugurated by Minister for Animal Husbandry, Dairy and Fisheries Mandali Buddha Prasad.

The college is affiliated to the Sri Venkateswara Veterinary University.
Addressing a gathering at ‘Gandhi Kshetram’ established by his father and former Minister Mandali Venkata Krishna Rao where the college was temporarily located, Mr. Buddha Prasad said that the college would move to its permanent campus coming up at an estimated cost of Rs. 2 crores at Bhavadevarapalli near here.
The Krishna district administration had already sanctioned nine acres for the college, and it would soon allot another 21 acres for establishing the campus.
The Minister noted that the college was the first institution to come up at Avanigadda after nearly three decades. He said aquaculture, which thrived in the area once, was partially affected by viral attack. Prosperous farmers had become paupers overnight for want of know-how. Chief Minister Y.S. Rajasekhara Reddy had responded positively when the proposal to set up a fisheries polytechnic was broached. A ‘Disease Investigation Lab’ would also be set up in the college in future. Sri Venkateswara Veterinary University Vice-Chancellor Manmohan Singh, presiding over the function, hoped that the college would become a model polytechnic in the country. Fisheries Commissioner Arvind Kumar said that the Government had set a target of increasing fisheries production from the current 9.4 lakh tonnes a year to 16 lakh tonnes by 2011. A college like this would go a long way in achieving the target, he felt.

History Of Mandali Venkata Krishna Rao

మండలి వెంకటకృష్ణారావు

మండలి వెంకట కృష్ణారావు (ఆగస్టు 41926 - సెప్టెంబర్ 271997)

 అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి 1972 లో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యుడు మరియు గాంధేయవాది. మాజీ రాష్ట్రమంత్రి మండలి బుద్ధప్రసాద్ ఈయన కుమారుడు. 1938 ఆగస్టు 4 న కైకలూరు మండలం పల్లెవాడ లో జన్మించారు. వీరి స్వస్థలంనాగాయలంక మండలంలోని భావదేవరపల్లి గ్రామము.
1926 ఆగస్టు 4న కృష్ణా జిల్లా కైకలూరు తాలూకా, పల్లెవాడ గ్రామంలో మండలి వేంకట కృష్ణారావు ‘దివిసీమ గాంధీ’ గా ప్రజల మన్ననలనందుకున్నారు. 1997 సెప్టెంబర్ 27న తుదిశ్వాస విడిచారు. ‘బాధలలో ఉన్న వారిని మనమే ముందు వెల్లి ఓదార్చాలని’ వారు ఆచరించి చెప్పిన మాటలు దివిసీమ ప్రజలకు భగవద్గీతలా వినిపిస్తూనే ఉంటాయి.
 గాంధేయవాది మండలి వేంకట కృష్ణారావు
మండలి వేంకట కృష్ణారావు కృషి వల్లే దివిసీమలోని నిరుపేదలకు బంజరు భూములను పంచె కార్యక్రమం 1955లో ప్రారంభమైంది. 15 వేల ఎకరాల బంజరు భూములను పేదలకు పంచారు. 1974 లో ఆయన విద్యా – సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1975 రాక్షస నామ సంవత్సరం ఉగాదినాడు ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమ నిర్వహణ కమిటీకి మండలి వెంకట కృష్ణారావు కార్యనిర్వాహక అధ్యక్షునిగా వ్యవహరించారు. ‘అంతర్జాతీయ తెలుగు కేంద్రం’ సంస్థను 1975లో నాటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ ప్రారంభించారు. మండలి వేంకటకృష్ణారావు ఈ సంస్థకు ప్రథమ అధ్యక్షులుగా వ్యవహరించారు.
ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల కార్యనిర్వాహక అధ్యక్షులుగా, అంతర్జాతీయ తెలుగు కేంద్రం ప్రథమ అధ్యక్షులుగా వ్యవహరించిన మండలి వేంకట కృష్ణారావు కృషిని గుర్తించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంతర్జాతీయ తెలుగు కేంద్రం పేరును ‘మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం’గా మార్చారు. దివిసీమ లోని పులిగడ్డ – పెనుమూడి వంతెనకు మండలి వేంకట కృష్ణారావు పేరు పెట్టారు.

History About Ghantasala

ఘంటసాల (కృష్ణా జిల్లా)

ఘంటసాల గ్రామములో అరుదైన బౌద్ధ స్తూపాలు 1919-20 సంవత్సరాల మధ్య త్రవ్వకాలలో దొరికాయి. ఈ గ్రామము ఒకప్పటి కాలములో భారత-రోమనుల మధ్య వర్తకములో ప్రధాన పాత్ర వహించింది. బౌద్ధ స్తూపాలు మరియు హిందు శిల్పా శిధిలాలు అప్పటి శిల్ప కళను తెలుపుతున్నాయి. క్రీ.పూ. 2-3 శతాబ్దమునకు చెందిన పాలరాతి శిల్పాలు, ఒక రాతి ఇటుక మీద 12 నక్షత్ర మండలాలు చెక్కబడిన శిల్పము మొదలుగు కొన్ని స్తూపాలు ఫ్రాన్సు వంటి దేశాల సంగ్రహాలయాలలో ఉన్నాయి.
ఘంటసాల గ్రామంలోని బౌద్ధమహా స్థూపం వద్ద, 2014,ఏప్రిల్ -15వ తేదీ, మంగళవారం నాడు, మహాచైత్రపౌర్ణమి సందర్భంగా, బౌద్ధభిక్షువు దమ్మతేజ బంతీజీ ఆధ్వర్యంలో, ప్రత్యేక పూజలు నిర్వహించినారు. గౌతమబుద్ధుని చిత్రపటానికి ధూప, దీప, ప్రత్యేక పూజలు నిర్వహించినారు. 
ఈ గ్రామంలో ఇటీవల మట్టి త్రవ్వకాలలో ఒక బుద్ధుడి ముఖ ప్రతిమ లభించినది. దానిని పురావస్తుశాఖ వారికి అందజేసినారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రదేశాన్ని ఒక పర్యాటక కేంద్రము గా తీర్చిదిద్దవలెనని ప్రణాళిక జరుపుతున్నది.
ఈ గ్రామము లొ ఒక సంగ్రహాలయము ఉన్నది. కాని ప్రభుత్వ అలసత్వ ధోరణి వల్ల ఇది పర్యాటకులను ఆకర్షించలేకపోతోంది..
190-110 సిఏ -బహుళ అంతస్తుల ప్రతిమ - ఘంటసాల, ఆంధ్ర ప్రదేశ్

ఘంటసాల వద్ద కాలభైరవ రాక్ కట్ రిలీఫ్

The Great History About Avanigadda


పురాణాలలో అవనిజాపురం గా ప్రసిద్ధిచెందిన గ్రామమే నేటి "అవనిగడ్డ" అని చరిత్ర చెప్పుచున్నది. శ్రీరామచంద్రుడు తన గురువైన వశిష్టుని ఆశ్రమంలో సీతాదేవికి ధర్మశ్రవణం చేయించారని, అందువలన "అవనిజాపురం" గా పిలిచినట్లు ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుచున్నాయి. సీతాదేవి వనవాసం ఉన్నది సీతలంక అనీ, వశిష్టాశ్రమాన్ని వశిష్టమెట్టగా పిలిచేవారు. శాతవాహనుల కాలంలో రేవుకేంద్రంగా, వ్యాపారకేంద్రంగా ఉన్న "అలోషైని" నామంతో ప్రసిద్ధిచెందిన ఓడరేవు ఇది. క్రీ.పూ.3వ శతాబ్దం నుండి క్రీ.శ.13వ శతాబ్ది వరకు, ఈ రేవుద్వారా పెద్ద నావలతో వ్యాపారం జరిగేదనీ,అదే నేటి అవనిగడ్డ గ్రామంగా చరిత్ర చెపుచున్నది. 14వ శతాబ్దం ప్రారంభం నుండి "అవనిగడ్డ" గానే పిలుస్తున్నట్లు చరిత్ర పరిశోధకులు వెల్లడించినారు.

About ChallaPalli

చల్లపల్లి గ్రామానికి 400 సంవత్సరాల చరిత్ర కలదు

చల్లపల్లిని రాజధానిగా యార్లగడ్డ వంశీకులు దేవరకోట రాజ్యమును కొద్ది కాలము పాలన చేశారు. ఇప్పటికీ ఇక్కడ చల్లపల్లి రాజా కట్టించిన చల్లపల్లి కోట అనే భవంతి కలదు. క్రీ.శ. 1576 లో యార్లగడ్డ గురువారాయడు ఈ రాజ్యమును స్థాపించారని ప్రతీతి. చల్లపల్లి రాజవంశీకులు నేటికీ అక్కడ జీవిస్తున్నారు. వీరిని చల్లపల్లి జమిందారులు అని కూడ అంటారు. స్వాతంత్ర్యము వచ్చిన పిమ్మట, రాచరిక వ్యవస్థ నిర్మూలనతో, చల్లపల్లి రాజులకు అధికారము పోయినది....

పూర్వము ప్రజలకు సమయాన్ని తెలియజేయటానికి కోటలో ప్రతి గంటకు గంటను మోగించేవారు. ఈ సాంప్రదాయము నేటికీ కొనసాగుతున్నది. ఈ కోటనుండి విజయవాడ కనకదుర్గమ్మ గుడి కనిపిస్తుందని, కోట నుండి కనకదుర్గమ్మ గుడి రహస్య సొరంగము ఉన్నదని స్థానిక ప్రజల నమ్మకము. అలానే, మచిలీపట్నము శివార్లలో వున్న శివగంగ అమ్మవారి గుడి కి అయ్యే ఖర్చు రాజావారు భరించేవారని, కోట నుంచి గుడికి సొరంగమార్గము ఉంది అని ప్రతీతి. ఈ కోట రమారమి 200 సంవత్సరాల పూర్వము కట్టించినది. కోటని చూడటానికి, అక్కడ వారిని కలువటానికి బయటి వారికి కుదురుతుంది, కానీ అనుమతి తీసుకోవాలి.

రాజావారు గ్రామములో ఒక ఉన్నత పాఠశాలను కూడా కట్టించారు. పరిసర గ్రామాలకు ఇదే పెద్ద ఉన్నత పాఠశాల.